ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు చిన్న వివాదం కారణంగా పట్టపగలు అందరిముందే మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కిందపడేసి మరీ కొట్టాడు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. స్థానికులు వారిని ఆపడానికి ట్రై చేసినా కూడా ఆగలేదు. బాధిత మహిళ యువకుడిపై జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.