AP: మహానంది క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం జరుపుకొన్న ఆదిదంపతులు మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవికి శనివారం రాత్రి వైభవంగా తెప్పో త్సవం నిర్వహించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో యర్రమల్ల మధు, గాయత్రి దంపతులతో పాటు దాతలు పాల్గొన్నారు. మరో వైపు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.