ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని సూరజ్ కుండ్‌కు చెందిన సిమ్రన్ గుప్తా అనే మోడల్ టీ వ్యాపారంలో దూసుకుపోతోంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కుటుంబ పోషణ కోసం సిమ్రన్ టీస్టాల్ వ్యాపారం చేయాలనుకుంది. 2022లో గోరఖ్‌పూర్‌లో ‘మోడల్ ఛాయ్‌వాలీ’ పేరుతో తొలి టీస్టాల్ ప్రారంభించింది. అందంగా ముస్తాబై టీ తయారుచేస్తూ ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. టీస్టాల్ వ్యాపారంతో ప్రస్తుతం నెలకు రూ. లక్షకు పైగానే సంపాదిస్తోంది.