ఏపీలో మరో కొత్త పథకం

73చూసినవారు
ఏపీలో మరో కొత్త పథకం
AP: కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతి పథకం, కేంద్ర ప్రభుత్వ పీఎం అజయ్ పథకాల ద్వారా రాయితీతో కూడిన ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం అందజేయనుంది. అయితే ఈ పథకానికి ఎస్సీలు అర్హులుగా నిర్ణయించారు. ఎస్సీలకు 50 శాతం రాయితీతో రూ.3 లక్షల విలువైన 4074 ప్యాంజిర్ ఆటోలను, 2685 మంది ఎస్సీ రైతులకు రూ.లక్షా 50 వేల విలువైన పవర్ స్ప్రేయర్స్, మోటార్ ఇంజిన్ వంటి పరికరాలను అందజేయనుంది.

సంబంధిత పోస్ట్