కేంద్ర మాజీ మంత్రి, తమిళనాడులోని ఈరోడ్-ఈస్ట్ ఎమ్మెల్యే EVKS ఇళంగోవన్ (73) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2004 నుండి 2009 వరకు జౌళి, వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర మంత్రిగా, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) చీఫ్‌గా సేవలందించారు. ఇళంగోవన్ మృతికి ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.