తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని హీరోయిన్, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాటి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు లావణ్యకు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.