హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.900 తగ్గి రూ.71,400గా ఉంది. వెండి ధర కూడా కేజీపై రూ.1000 తగ్గి రూ.1,00,00కు చేరింది. ఇవే ధరలు ఏపీలోనూ కొనసాగుతున్నాయి.