ఈ సింపుల్ చిట్కాలతో స్వచ్ఛమైన తేనెను గుర్తించండి

61చూసినవారు
ఈ సింపుల్ చిట్కాలతో స్వచ్ఛమైన తేనెను గుర్తించండి
ఒక గ్లాసు నీటిలో కాస్త స్వచ్ఛమైన తేనెను వేసినప్పుడు, అది కరిగిపోకుండా నేరుగా అడుగుకు చేరి ముద్దలా స్థిరపడుతుంది. నకిలీదైతే కాసేపటికి కరిగిపోతుంది. రోజులు గడిచే కొద్దీ శుద్ధమైన తేనెలో తేమశాతం తగ్గి, స్ఫటిక ఆకృతిలో కాస్త బరకగా మారుతుంది. అదే నకిలీదైతే నెలలు గడుస్తున్నా ద్రవ రూపంలోనే ఉంటుంది. శుద్ధమైన తేనెను వెనిగర్ తో కలిపితే నురుగు ఏర్పడదు. స్వచ్ఛమైన తేనెలో ముంచాక కూడా అగ్గిపుల్ల వెలుగుతుంది.

సంబంధిత పోస్ట్