తుఫాన్ ప్రభావం తగ్గడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 58,607 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.61 కోట్ల ఆదాయం సమకూరింది.