AP: నగ్నవీడియోలతో బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ, హింసలకు గురి చేస్తున్నాడంటూ ఓ వివాహిత సోమవారం గుంటూరు జిల్లా SP కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరు నల్లపాడు రోడ్డులో తినుబండారాల వ్యాపారం చేస్తున్న మహిళ ఫోన్ నెంబర్ తీసుకున్న YCP నాయకుడు నాగేశ్వరరావు పరిచయం పెంచుకున్నాడు. తరువాత తనపై అత్యాచారం చేసి చిత్రీకరించాడు. వాటిని అడ్డుపెట్టుకొని తరచూ అత్యాచారం చేస్తున్నాడని మహిళా పోలీసులను ఆశ్రయించింది.