మెంతి ఆకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ ఎ, సి, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం నుంచి రక్షణ కల్పిస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మెంతి ఆకులను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించుకోవచ్చు. ఈ ఆకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి.