ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు కందిపప్పు, చక్కెర అందించాలని నిర్ణయించింది. అయితే వాటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నలు కూడా రేషన్ దుకాణాల ద్వారా అందించే ప్రయత్నాల్లో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జనవరి నుంచి ఈ సరుకులను కూడా రేషన్ బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.