భారీ వర్షాల కారణంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ శుక్రవారం తెలిపారు. 07281 నరసాపూర్ -గుంటూరు రైలును ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. 07783 విజయవాడ- గుంటూరు, 07779 గుంటూరు-మాచర్ల, 07580 మాచర్ల-నడికుడి, 07579 నడి కుడి-మాచర్ల రైళ్లు ఈ నెల 6, 7వ తేదీల్లో రద్దు చేశామన్నారు.