పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధం బాలుర వసతి గృహాలకు.. వార్డెన్లను నియమించినట్లు ఇన్చార్జి ఉపకులపతి గంగాధర్ రావు గురువారం తెలిపారు. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో వార్డెన్ లతో కలిసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి వసతి గృహాలు లేవని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి వసతి కల్పించి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.