పొన్నూరు మండలంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వరరావు వ్యవసాయ అధికారులతో కలిసి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వెల్లలూరు , మునిపల్లె, బ్రాహ్మణ కోడూరు, జూపూడి, దోప్పలపూడి, మన్నవ గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడుతూఒక ఎకరానికి కార్భనిజం మ్యాంగోజబ్ కలిగివున్న శిలీంద్ర నాశిని మందును 400 గ్రా. ఫార్మాలేషన్ నెంబర్ 4తో కలిపి 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.