గుంటూరు రూరల్ మండలం లాలుపురంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.