ఫిరంగిపురంలో డివైడర్ ను ఢీకొని తిరగబడ్డ లారీ

79చూసినవారు
లారీ అదు తప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటన ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉల్లిపాయల లారీ మహారాష్ట్ర నుంచి నల్లపాడు వైపు వెళుతుండగా, పంచాయతీ కార్యాలయం వద్ద డివైడర్ కనిపించక అదుపుతప్పి పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు. ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్