బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మీదుగా ప్రయాణిస్తోంది. రానున్న 12 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.