పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ తప్పక జరగాలి: నీరబ్ కుమార్

71చూసినవారు
పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ తప్పక జరగాలి: నీరబ్ కుమార్
రాష్ట్రంలో వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో 3 నెలలకు ఒకసారి తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్