గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు సగటున 7. 1 మి. మీ. వర్షపాతం నమోదైంది. కొల్లిపర మండలంలో అధికంగా 40. 6 మి. మీ. వర్షం కురిసింది. తెనాలి 20. 8, ఫిరంగిపురం 15. 8, దుగ్గిరాల 12. 8, మేడికొండూరు 9. 4, చేబ్రోలు 7. 8, పొన్నూరు 7. 4, గుంటూరు పశ్చిమ 3. 2, వట్టిచెరుకూరు 2. 4, పెదనందిపాడు 1. 8, ప్రత్తిపాడు 1. 8, కాకుమాను 1. 4, గుంటూరు తూర్పు 1. 2, తాడికొండ 1. 2, తుళ్లూరు 1. మి. మీ. వర్షపాతం నమోదైంది.