అద్దంకి: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన సీఐ సుబ్బరాజు

81చూసినవారు
అద్దంకిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదోవ తరగతి పరీక్షలను బుధవారం సర్కిల్ సీఐ సుబ్బరాజు పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును, పరిషత్ విద్యార్థులు హాజరు వివరాల గురించి ఆయన చీఫ్ ఇన్విజిలేటర్ మారుతిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 200 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన సీఐకు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్