కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ సంబంధించి రూపాయి పడి ఆగిపోయిన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే నగదు మళ్ళీ విడుదల చేస్తామని అన్నారు.