సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని గ్రంథాలయ శాఖ నందు ఆదివారం ఉదయం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చదవటం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ అల్తాఫ్ పాల్గొని గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయాల ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని ఆయన వివరించారు. కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు.