అద్దంకి నియోజకవర్గం లో అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 24 మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం సంతమాగులూరు లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధితులకు అందజేశారు. మొత్తం 24 మందికి 16, 39, 015 లక్షల రూపాయలను అందించారు. ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.