సింగరకొండ పాలెం గ్రామపంచాయతీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మండల ఎంపీడీవో సింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా ప్రజా పరిషత్ డిప్యూటీ సీఈఓ బాలమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆమె పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.