వాటర్ ప్లాంట్ లు తొలగించాలని ధర్నా

574చూసినవారు
సంతమాగులూరు మండలం ఏల్చూరు జాతీయ రహదారి వద్ద రోడ్డుపై ఉన్న వాటర్ ప్లాంట్ల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని శనివారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్ కు వెళ్లే రోడ్డు సమీపంలో వాటర్ ప్లాంట్ లు అధికంగా ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వారు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వాటిని తీసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్