నేను బడికి పోతా కార్యక్రమంపై సమగ్ర సమీక్ష

76చూసినవారు
నేను బడికి పోతా కార్యక్రమంపై సమగ్ర సమీక్ష
నేను బడికి పోతా కార్యక్రమంపై తహసీల్దార్ నిర్మలానంద బాబా సమగ్ర సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన కార్యక్రమంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు చదువుపై అవగాహన కల్పించి విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలన్నారు

సంబంధిత పోస్ట్