బాపట్ల పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కుటుంబ కలహాలు నేపథ్యంలో శుక్రవారం కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం తూము కాలువ దగ్గర బిర్యాని పాయింట్ వ్యాపారం చేస్తున్న నాగరాజు కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపం చెంది బాపట్ల శివారు తూము కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.