భారతదేశ ప్రధమ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి సోమవారం బాపట్ల ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఎంపిడిఓ బి. బాబురావు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరంఎంపిడిఓ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర పోరాటం లో అబుల్ కలాం పాల్గొనడమే గాకుండా, భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక కొత్త మార్పులు తీసుకు వచ్చి విద్యాభివృద్ధికి దారులు వేసిన మహానుభావుడు అని కొనియాడారు.