బాపట్ల పట్టణంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం దత్తత అవగాహన మాసోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ త్రివేణి పాల్గొని చట్ట బద్దంగా దత్తత తీసుకోవడం, దత్తతకు కావలసిన విధివిధానాలను వివరించారు. డిసిపిఓ పురుషోత్తం రావు మాట్లాడుతూ దత్తత కావలసిన తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా మాత్రమే తీసుకోవాలని సూచించారు.