ఈనెల 6, 7 తేదీలలో విజయవాడలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సెలక్షన్ క్రీడాంశాలలో బాపట్ల జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు జాతీయస్థాయిలో క్రీడలలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకట మురళి ఎంపికైన క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీలలో గెలుపొందాలని సూచించారు.