రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దీపం పథకం పేరుతో మహిళలను మోసం చేస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని బాపట్ల జిల్లా వైయస్సార్ పార్టీ దివ్యాంగుల అధ్యక్షుడు చల్లా రామయ్య ఆరోపించారు. శనివారం బాపట్లలో దీపం పథకం మహిళలతో కలిసి మాట్లాడారు.
గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లో డబ్బులు వేస్తానని చెప్పి ఇప్పటికి వేయలేదని మహిళలు ఆరోపించారు. వైయస్సార్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పథకాలు అందాయని మహిళలు తెలిపారు.