బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జయ వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలను వారికి అర్జీల రూపంలో అందించారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖలకు పంపి సత్వరమే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.