బాపట్ల: సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాo

62చూసినవారు
బాపట్ల పట్టణ1వ వార్డు జగనన్న కాలనీ ప్రజలు తమకు కాలనీలో త్రాగునీరు విద్యుత్తు రోడ్లు వసతులు కల్పించాలని బుధవారం మీడియా ముందు వాపోయారు. నెలలు గడుస్తున్న అధికారులు వచ్చి విచారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీ పేరు మీద ఉండటమేనా తప్పు అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకపోతే నిరసన వ్యక్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా వైసిపి దివ్యాంగుల అధ్యక్షుడు చల్ల రామయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్