బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం జాతీయ రహదారిపై శుక్రవారం మోటారు వాహనాల తనిఖీ అధికారి బానువెంకట రంగారావు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సరైన పత్రాలు లేకుంటే భారీ అపరాధ రుసుం విధిస్తామని వాహనదారులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తనిఖీల్లో మూడు వాహనాలకు అపరాధ రుసుం విధించారు.