కర్లపాలెం మండలం యాజలి పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి పర్యావరణాన్ని భూగర్భ జలాలు కాపాడాలని జై భీమ్ రావ్ భారత పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు అర్జీ అందించినట్లు తెలిపారు. ఎవరైతే అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్నారో వాళ్లకు కోటి రూపాయలు పెనాల్టీ వేయాలని డిమాండ్ చేశారు.