తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని బాపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గోపీనాథ్ అన్నారు. బుధవారం కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ప్రసంగించారు. పుట్టిన బిడ్డకు గంటలోపే ముర్రుపాలు తాగించటం వలన వివిధ రోగాలు దరి చేరవని బిడ్డ ఆరోగ్యంగా జీవిస్తాడని తెలిపారు. తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు. ఆరోగ్య సిబ్బంది యూసఫ్ షకీల్, జె. రాంబాబు, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.