ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బుధవారం కర్లపాలెం మండలం పెద పులుగు వారి పాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. వంద రోజుల సంక్షేమ పథకాలు అభివృద్ధి తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రజలకు వివరించారు. గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.