చీరాల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం ఆకలి కేకలు వినిపించాయి. ఉదయం పూట అల్పాహారం అందించకపోవడంతో విద్యార్థినులు ఆకలితో అలమటించారు. గ్యాస్ అయిపోవడం వల్ల ఇలా జరిగిందని విద్యాలయం అధికారులు ఇచ్చిన సంజాయిషీ వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. ఈ సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించి బాధ్యులైన అధికారుల మీద కలెక్టర్ కి నివేదిక సమర్పించారు.