బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నారాయణ బట్టు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం యొక్క విశిష్టతని ఎన్ఎస్ఎస్ డే యొక్క ప్రాముఖ్యతని విద్యార్థులకు తెలియజేశారు. దేశ ప్రగతిలో, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది యువకులేనని కనుక అందరూ సేవా భావాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి సమాజ సేవలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.