బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ లో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఎంపీటీసీ, సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు సభ్యులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి మహాత్మా గాంధీ చేసిన సేవలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మహాత్మా గాంధీ జీవిత విశేషాలు తెలిపారు.