పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, గ్రామీణ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ తుషార్ డూడీ "పల్లె నిద్ర" అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో శుక్రవారం రాత్రి పోలీస్ అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో "పల్లెనిద్ర" చేశారు. ఏఎస్పి టి. పి. విఠలేశ్వర్ చందోలు హరిజనవాడలో, చీరాల డిఎస్పి పి. జగదీష్ నాయక్ రామాపురంలో "పల్లెనిద్ర" కార్యక్రమాన్ని నిర్వహించారు.