బాపట్ల: రైతు బజార్ ను వినియోగంలోకి తేవాలి: బీఎస్పీ

58చూసినవారు
బాపట్ల పట్టణంలో దశబ్ద కాలంగా నిర్మించిన రైతు బజార్ నిరుపయోగంగా ఉందని దానిని వాడుకలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదురు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ వెంకట మురళికి రైతు బజార్ సమస్యపై వినతి పత్రం అందించినట్లు తెలిపారు. సన్న చిన్న కారు రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్