బాపట్ల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి దాడులు, హత్యలు జరుగుతున్నాయని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించి అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రేపల్లె ఇన్చార్జి వేమూరి గణేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వం లో దాడులు ఎక్కడ జరగలేదని కూటమి ప్రభుత్వ అరాచకాలు అరికట్టాలని కోరారు.