బాపట్ల పట్టణం 11వ వార్డు టీచర్స్ కాలనీలో శనివారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ పాల్గొన్నారు. మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి స్వచ్ఛ బాపట్లగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వేగేశన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మొక్కలు పెట్టారు. కమిషనర్ నిర్మల్ కుమార్, సిబ్బంది కూటమి శ్రేణులు పాల్గొన్నారు.