పట్టణoలోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్..

69చూసినవారు
పట్టణoలోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్..
బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని లోతట్టు ప్రాంతమైన గంగపుత్ర కాలనీని మంగళవారం మున్సిపల్ కమీషనర్ జి. రఘునాథ రెడ్డి పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా గృహల మధ్య నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రోగాలు ప్రబలకుండా బ్లీచింగ్, సున్నం చల్లి శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు , సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్