బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పీఎం గ్రామీణ అవాస యోజన పథకం పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ప్రధాని ప్రసంగించారు. అనంతరం పధకంలో భాగంగా లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ , చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య కలిసి అందించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.