బొల్లాపల్లి: తండ్రిపై కుమారుడి దాడి
నిత్యం తాగి గొడవపడుతున్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో శనివారం రాత్రి జరిగింది. బొల్లాపల్లి ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం వడితే బద్దెనాయక్ కు తాగుడు అలవాటు ఉంది. ఈ క్రమంలో రోజూ ఇంట్లో గొడవపడుతుంటున్నాడు. దీంతో కుమారుడు కోటానాయక్ తండ్రిపై కొడవలితో దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.