బొల్లాపల్లి: చెరువులో దిగి యువకుడు మృతి

75చూసినవారు
బొల్లాపల్లి: చెరువులో దిగి యువకుడు మృతి
బొల్లాపల్లి మండలంలోని కనమలచెరువు గ్రామానికి చెందిన పూజల అంజయ్య(36) మంగళవారం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంజయ్య గేదెలను తోలుకొని వెళ్తుండగా సమీపంలోని గ్రామానికి ఆను కొని ఉన్న గేదె చెరువులోకి వెళ్లింది. గేదెను తీసుకు వచ్చేందుకు చెరువులోకి దిగి ప్రమాద వశాత్తు పూడికలో ఇరుక్కు పోయాడు. పక్కనే సమీప పొలాల రైతులు అంజయ్యను ఒడ్డుకు తీసుకు రాగా అప్పటికే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్