టీడీపీ నేత కారుకు నిప్పటించిన ప్రత్యర్థులు
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెంలో వైసీపీ నాయకులు టీడీపీ నేత కారుకు నిప్పటించారు. తెలుగు యువనేత పోక వెంకట్రావు ఇంటి ముందు ఉన్న కారుని గురువారం అర్ధరాత్రి ప్రత్యర్థులు తగలబెట్టారు. ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు మంటలు ఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.